ఆలేరు నియోజకవర్గంలో మహిళా కాంగ్రెస్ ఇన్చార్జిగా ఎవరినీ నియమించలేదు-నీలం పద్మ

Published: Friday December 24, 2021
యాదాద్రి భువనగిరి జిల్లా 22 డిసెంబర్ ప్రజాపాలన ప్రతినిధి: నీలం పద్మ వెంకటస్వామి ఆద్వర్యంలో మహిళా కాంగ్రెస్ విస్త్రుత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందిరా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆలేరు లో మహిళా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం బుధవారం నాడు అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ మండల పార్టీ అధ్యక్షులకు జిల్లా కమిటీ మెంబర్లకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునిత రావు ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ చైతన్యవంతంగా పనిచేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి వివిధ రకాల నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతి మహిళ ఒక ఆది శక్తి గా మారి శక్తి వంచన లేకుండా పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని ఈ సందర్భంగా మనవి చేశారు. తోటి మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సభ్యులను కోరారు. ఎక్కడైనా మహిళల పైన అవాంఛనీయ సంఘటనలు జరిగినా మీ దృష్టికి వచ్చినా వెంటనే మహిళా కాంగ్రెస్ ముందుంటుందని తెలిపారు. అంతేకాకుండా  బాధితులు లేదా వారి కుటుంబాలకు తగిన న్యాయం జరిగేంత వరకు మహిళా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆలేరు నియోజకవర్గంలో మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి ఎవరూ . లెరు నెనుఈ పదవికి ఎలాంటి నియామక పత్రం తాను ఇవ్వలేదని సమావేశంలో తెలిపారు. ఈ సమాచారం ను జిల్లా కమిటీ సభ్యులు గాని, మండల పార్టీ అధ్యక్షులు గాని, బ్లాక్ అధ్యక్షులు గాని గమనించగలరని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండల పార్టీ అధ్యక్షురాలు చైతన్య, రాజాపేట మండల పార్టీ అధ్యక్షురాలు అంబాబాయి, ఆలేరు మండల పార్టీ అధ్యక్షురాలు అనిత, జిల్లా కార్యదర్శి  ప్రతిభ, ఆలేరు పట్టణ అధ్యక్షురాలు అనిత, రాజంపేట పట్టణ అధ్యక్షురాలు విజయలక్ష్మి, సోమవారం గ్రామ శాఖ అధ్యక్షులు పద్మ, సభ్యులు అమృత బాలమ్మ కవిత రజిత మొదలగు వారు పాల్గొన్నారు.