బోనకల్ గ్రామంలో కొత్త మీటర్ బిగిస్తే విద్యుత్ శాఖ లైన్ మెన్ రాజేష్ కు రూ. 500 లంచంగా ఇవ్వవలసింద

Published: Friday August 27, 2021
బోనకల్లు, ఆగష్టు 27, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ గ్రామంలో ఎవరైనా కొత్త మీటరు ఆన్ లైన్ ద్వారా పొందితే ఆ గ్రామ లైన్మెన్ రాజేష్ కు పంట పండినట్లేకొత్త మీటర్ వచ్చిన ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు స్తంభం నుండి విద్యుత్ కనెక్షన్ ఇవ్వవలసిన బాధ్యత ఉంది. వారికి ప్రభుత్వం నుండి జీతాలు వస్తున్నాయి. ప్రభుత్వం నుండి నెలసరి శాలరీ ఇచ్చేదే కొత్త మీటర్లు బిగించడం, మరియు విద్యుత్ లైన్ లో ఏమైనా మరమ్మతులు ఉంటే చేయడం వాళ్ళ బాధ్యత. కానీ కొత్త మీటర్ వచ్చిందంటే ఆ మీటర్ బిగించే విద్యుత్ శాఖ అధికారి మీటర్ బిగించే సమయంలో నేను స్తంభం ఎక్కి కష్టపడ్డాను ఒక 500 ఇవ్వండి అని లంచం అడుగుతున్న పరిస్థితి బోనకల్ గ్రామంలో ఏర్పడ్డది.విద్యుత్ శాఖఅధికారికి 500 ఇవ్వకపోతే విద్యుత్ కనెక్షన్ ఇస్తారో ఇవ్వరో నని భయపడి చాలామంది విద్యుత్ శాఖ అధికారి రాజేష్ కు 500 రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం. ఇలా గ్రామాలలో విద్యుత్ శాఖ లైన్ మెన్ లు 500 రూపాయలు వసూలు చేస్తుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్లు అని లేక ఇందులో ఉన్నత అధికారులకు కూడా భాగం వెళ్తుందా అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా 500 రూపాయలు లంచంగా తీసుకుంటున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.