అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి20116/-రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన చేడే శ్రీనివాస్ స్నేహితులు, సన్న

Published: Tuesday February 28, 2023

 

బోనకల్ ,ఫిబ్రవరి 27 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని మోటమర్రి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసే వంట మనిషి కుమారుడు మంద తిరుపతిరావు కు ఇటీవల వెన్నుపూసకు సంబంధించినటువంటి ఆపరేషన్ చేయించుకున్నను పూర్తిస్థాయి స్వస్థత చేకూరకపోవడంతో ఆమె భర్త కూడా పక్షవాతంతో మంచానికి పరిమితమయ్యారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి గమనించిన ఉపాధ్యాయుడు చేడే శ్రీనివాస్ కొంతమందిని సంప్రదించగా తన శిష్యుడైనటువంటి సాఫ్ట్వేర్ రాజరత్న కిరణ్ పదివేల రూపాయలు, మిత్రుడు అమెరికాలో నివాసం ఉంటున్న అప్పారావు ఐదువేల రూపాయలు ,మరొక మిత్రుడు తేరాల శివరామకృష్ణమూర్తి రెండు వేల నూట పదహారు రూపాయలు , బంధువు కంభంపాటి ప్రదీప్ రెండు వేల రూపాయలు, ఉపాధ్యాయుడు శ్రీనివాస్ వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందించగా సోమవారం నగదును వారి కుటుంబానికి ప్రధానోపాధ్యాయులు షేక్ చాంద్ పాషా చేతుల మీదగా అందజేశారు. ఆర్థిక సహాయంగా దాతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.బోనకల్ ,ఫిబ్రవరి 27 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని మోటమర్రి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసే వంట మనిషి కుమారుడు మంద తిరుపతిరావు కు ఇటీవల వెన్నుపూసకు సంబంధించినటువంటి ఆపరేషన్ చేయించుకున్నను పూర్తిస్థాయి స్వస్థత చేకూరకపోవడంతో ఆమె భర్త కూడా పక్షవాతంతో మంచానికి పరిమితమయ్యారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి గమనించిన ఉపాధ్యాయుడు చేడే శ్రీనివాస్ కొంతమందిని సంప్రదించగా తన శిష్యుడైనటువంటి సాఫ్ట్వేర్ రాజరత్న కిరణ్ పదివేల రూపాయలు, మిత్రుడు అమెరికాలో నివాసం ఉంటున్న అప్పారావు ఐదువేల రూపాయలు ,మరొక మిత్రుడు తేరాల శివరామకృష్ణమూర్తి రెండు వేల నూట పదహారు రూపాయలు , బంధువు కంభంపాటి ప్రదీప్ రెండు వేల రూపాయలు, ఉపాధ్యాయుడు శ్రీనివాస్ వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందించగా సోమవారం నగదును వారి కుటుంబానికి ప్రధానోపాధ్యాయులు షేక్ చాంద్ పాషా చేతుల మీదగా అందజేశారు. ఆర్థిక సహాయంగా దాతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.