కెసిఆర్ ముఖ్యమంత్రి కాదు, మోసగాడు అనాలి: వైయస్సార్ టి పి అధ్యక్షురాలు షర్మిల

Published: Tuesday June 14, 2022
వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే వైయస్సార్ తెలంగాణ పార్టీ
 
 
బోనకల్: మండలంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా సోమవారం రావినూతల ,బోనకల్ ,ముష్టికుంట్ల గ్రామాలలో పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో  రైతు పక్షపాతి గా ఉన్నారని, వైఎస్సార్ హయాంలో  రైతులు సంతోషంగా ఉన్నారని, వైఎస్సార్ 5 ఏళ్లు సీఎం గా ఉంటే ఎటువంటి పన్నులు పెంచలేదు,ఛార్జీలు పెంచలేదు,ధరల పెరుగుదల లేదని ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్ లా ఉండాలని ఆమె అన్నారు.  ప్రస్తుతం సీఎంగా ఉన్న కేసీఆర్  తెలంగాణ ప్రజలను మోసం చేశారని, కేసీఆర్ ఒక మోసగాడని, ముఖ్యమంత్రి పదవిలో ఉండే హక్కు లేదని,
మాట మీద నిలబడలేని వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు విమర్శించారు. 8 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్  మోసపూరిత వాగ్దానాలు లతో ప్రజలను మోసం చేస్తున్నారని, ముఖ్యమంత్రి కాదు మోసగాడు అనాలని అన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టానని ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఈ పాదయాత్ర అని అన్నారు.
పార్టీ కొత్తది అయినా వైఎస్సార్ మాత్రం కొత్త కాదని, ఐదు సంవత్సరాలు సీఎంగా పనిచేసిన కాలంలో ఇంకా ప్రజల గుండెల్లో బతికి ఉన్నారని, వైఎస్సార్ ను అభిమానించే ప్రతి ఇంటిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా ఎగరాలని, ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే వైఎస్సార్ పథకాలను తప్పకుండా అమలు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే అంత మందికి పెన్షన్లు ఇస్తానని,
 ఓటు అనేది మీ చేతుల్లో ఉండే ఆయుధం అని,  ఓటు అనే ఆయుధాన్ని వృధా చేసుకోకుండా వైయస్సార్ ని గుర్తుకు తెచ్చుకొని ఆలోచన చేసి మీకోసం తపించే వారికి ఓటు వేయండి అని అన్నారు.
 
ముష్టికుంట గ్రామస్థులతో మాట ముచ్చట.....
 
ముష్టికుంట్ల గ్రామంలో గ్రామ ప్రజలు తమ సమస్యలను షర్మిలకు విన్నవించుకుంటూ ఒక్కొక్కరిగా మాట్లాడుతూ
మా గ్రామంలో ఒక్కరికీ కూడా డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వలేదని, రేపే మీకు ట్రాక్టర్ వస్తుంది .రేప్ ఇల్లు వస్తుంది, రేపే ఒక గేదె.. రేపే ఒక ఆవు వస్తుంది అని ఇలా మాయమాటలు  చెప్పారనీ, గ్రామంలో అర్హులైన వారికి
పెన్షన్లు కూడా రావడం లేదని, పండించిన పంటకు మద్దతు ధర లేక రైతులు నష్టపోయాం అని,రుణమాఫీ చేయక పోవడం తో అప్పుల పాలు కావాల్సి వచ్చింది.
వైఎస్సార్ హయాంలో క్వింటా పత్తికి 10 వేలు పలికేది,
మా గ్రామం లో సిమెంట్ రోడ్లు వేస్తా అని హామీ ఇచ్చి ఇంతవరకు ఎక్కడ రోడ్లు వేయలేదని,వర్షం వస్తె రోడ్లు అధ్వాన్నం గా ఉంటాయని వారు అన్నారు. అదేవిధంగా
దోభి ఘాట్ కు ఉచిత కరెంట్ అని చెప్పి మోసం చేశారనీ,
 మొక్క జొన్న పండే పంటకు ఎకరాకు కౌలు రెండు వేలు పెంచారనీ,యూరియా ధరలు పెంచడం తో రైతులకు గిట్టు బాటు కావడం లేదనీ గ్రామ ప్రజలు వారి వారి సమస్యలను షర్మిలకు విన్నవించుకున్నారు.