ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Saturday May 08, 2021
మేడిపల్లి, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : హబ్సిగూడ డివిజన్లోని వెంకట్ రెడ్డి నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో జరుగుతున్న కరోనా టెస్ట్ లు మరియు మొదటి ,రెండవ డోసు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ లకు మందుల సరఫరా వంటి విషయాలను ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రి ఆవరణంలో రోగులకు నీడ కోసం టెంటు, మంచినీళ్లు వంటి కనీస సౌకర్యాలు చేకూర్చే విధంగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్లకు సూచించారు. ఈ  కార్యక్రమంలో డాక్టర్ దివ్య మరియు ఆసుపత్రి వైద్య సిబ్బంది టిఆర్ఎస్ నాయకులు వనం పల్లి గోపాల్ రెడ్డి, గరిక సుధాకర్, డాక్టర్ చారి, నంది కంటి శివ, సోమిరెడ్డి, చిన్న, యకాంత్ రావు, సూరం శంకర్, పుట్ట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.