దసరా, దీపావళి పండుగలకు ప్రత్యేక రైలు నడిపించండి మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి కొలిపాక శ్రీన

Published: Tuesday October 04, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 3 ప్రజా పాలన ప్రతినిధి: బతుకమ్మ,  దసరా, దీపావళి, పండుగల సందర్భంగా సికింద్రాబాద్ నుండి సిర్పూర్ కాగజ్ నగర్ వరకు  ప్రత్యేక రైలు నడిపించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు బెల్లంపల్లి మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్ సోమవారం విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
  బతుకమ్మ, దసరా, దీపావళి, పండుగల సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లో మహిళలు జరుపుకునే అతి పెద్ద పండుగ  బతుకమ్మ అని, మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు, సింగరేణి కార్మికులు, ఈ  పండగల కోసం సికింద్రాబాద్ నుండి కాగజ్నగర్ వరకు అధికంగా ప్రయాణం కొనసాగిస్తారు కావున, ప్రస్తుతం నడుస్తున్న రైలు సరిపోవడం లేదని, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్    సిర్పూర్ కాగజనగర్ నుంచి -సికింద్రాబాద్ కు ఫెస్టివల్ రైలును  ప్రతి రోజు ఉదయం,  6గంటలకు సిర్పూర్ కాగజనగర్ నుంచి బయలు దేరి సికింద్రాబాద్ కు 11గంటలకు చేరుకుని,   తిరిగి సాయంత్రం 7-30కి సిర్పూర్ కాగజనగర్ కు చేరుకునే లాగా నడపాలని, ఆయన విజ్ఞప్తి చేశారు.
 
 
 
Attachments area