ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తత ఆవశ్యకం

Published: Monday January 17, 2022
జిల్లా ఎస్‌పి నంద్యాల కోటి రెడ్డి ఐపిఎస్
వికారాబాద్ బ్యూరో 16 జనవరి ప్రజాపాలన : ఆన్లైన్ మోసాల పట అప్రమత్తత ఆవశ్యకమని జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి ఐపీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత సమయంలో నేరగాళ్ల ధోరని పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. నేరగాళ్ళు అమాయక ప్రజలకు ఆశ చూపి తమ వలలో వేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు రు. మన చుట్టూ ప్రక్కల వాళ్ళలో గాని మన బందుమిత్రులల్లో ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతులలో మోసపోయినట్లు అయితే వారిని  వెంటనే ఎన్ సి ఆర్ పి పోర్టల్  (www.cybercrime.gov.in)  లో ఫిర్యాదు చేయించాలని సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్లు 155260, డయల్ 100, 112 లకు కాల్ చేయాలని, విధ్యార్థులు, ఉద్యోగులు, యువతి యువకులు సైబర్ నేరాల గురించి పూర్తిగా తెల్సుకొని గ్రామీణ ప్రాంత ప్రజలలో అవగాహన కల్గించి సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా చూడాలి అని జిల్లా ఎస్‌పి తెలిపినారు. తక్కువ ధరకే వాహనం.. సత్వరం రుణం, ఆరోగ్యకార్డులు అందిస్తాం.. రూ. కోట్ల విలువైన లక్కీ లాటరీ మీకే..! ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగం.. పాన్ కార్డ్ కేవైసీ నవీనకరిస్తాం.. బ్యాంకు ఖాతా, ఓటీపీ చెబితే చాలు..!! అని కూపీ లాగుతున్న సైబర్ నేరగాళ్లు సామాన్యులను మోసం చేస్తున్నారు.బ్యాంకు ప్రతినిధిగా మాటలు కలుపుతూ సొమ్ము కాజేస్తున్నారు. కళ్లు మూసి తెరిచే లోపల మోసాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏమాత్రం ఏమరుపాటు వహించినా మొదటికే మోసం వస్తుంది. కావున ప్రజలు ఇట్టి మోసాలపైనా దృష్టి కేంద్రీకరించాలని జిల్లా ఎస్‌పి పేర్కొన్నారు.