గ్రామీణ ప్రజలకోసం మెరుగైన వైద్య సేవలు : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Wednesday April 20, 2022
వికారాబాద్ బ్యూరో 19 ఏప్రిల్ ప్రజాపాలన : గ్రామీణ ప్రజలకోసం మెరుగైన వైద్య సేవలు అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బంట్వారం మండల కేంద్రంలోని ZPHS పాఠశాల ఆవరణలో వికారాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వారు  నిర్వహించిన ఆరోగ్య మేళా (మెగా వైద్య శిబిరం) ను ప్రారంభించారు. అన్ని రకాల వైద్య నిపుణులతో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వెలకట్టలేని సేవలందించిన ANM లు, ఆశా వర్కర్లు మరియు వైద్య సిబ్బందిని అభినందించారు. మెడికల్ క్యాంపులో ఏర్పాటు చేసిన వైద్య సేవలు పర్యావేక్షిస్తూ... ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి రోగులకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి వైద్య శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, వైద్య సిబ్బంది, వివిధ గ్రామాల ప్రజలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు