ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని చేర్పించ్చండి సర్పంచ్ దొండపాటి రుక్మిణమ్మ పిలుపు

Published: Friday June 17, 2022
మధిర జూన్ 16 రూరల్ ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడు మనఊరు మన బడిలో యుపిఎస్ ఖమ్మంపాడు ఎంపిక కావడం హర్షించదగిన పరిణామం.ఉపాధ్యాయ బృందం కృషి,గ్రామస్థుల సహకారం తో 150 మంది కి చేరుకున్న విద్యార్థుల సంఖ్యయుపిఎస్ ఖమ్మంపాడు పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు నాగులు మీరా అధ్యక్షతన *తల్లిదండ్రుల సమావేశం జరిగింది*.సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన *గ్రామ సర్పంచ్ దొండపాటి.రుక్మిణమ్మ* మాట్లాడుతూ
ప్రభుత్వపాఠశాలల్లో ఉన్నత చదువులు చదివిన,పోటీ పరీక్షలకు ఎదుర్కొని సెలెక్ట్ ఐన ఉపాధ్యాయులు ఉన్నారని,ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు,యూనిఫారం,మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తోందని,SC,BC విద్యార్థులకు స్కాలర్ షిప్ లు కూడా అందిస్తుందని *తల్లిదండ్రులు పిల్లల్ని మన పాఠశాలలోనే చదివించాలని పిలుపునిచ్చారు*.మన ఊరు మన బడి తో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారబోతున్నాయని,ఏడు సంవత్సరాల క్రితమే మా పాఠశాల బృందం ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం తో నేడు ఏడు తరగతులు కూడా ఇంగ్లీష్ మీడియం లో బోధన జరగడం తో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారని పేర్కొన్నారు.సమావేశం లో *విద్యాకమిటీ చైర్మన్ కంచం.వెంకట కృష్ణ,పాఠశాల ఉపాధ్యాయులు T.కృష్ణారెడ్డి,SK.మదార్,కొమ్ము.శ్రీనివాసరావు, R.బ్రహ్మారెడ్డి,K.సునీత,CH.జ్యోతి,అంగన్ వాడి టీచర్ మువ్వ. పద్మ,తల్లిదండ్రులు,గ్రామ పెద్దలు హాజరైనరు*.