పాలసీ దారుల బోనస్లు పెంచుతూ జిఎస్టి తొలగించి ఏజెంట్ల సమస్యలు పరిష్కరించాలి. సామల శ్రీనివాస

Published: Tuesday September 06, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి.భారతీయ జీవిత బీమా సంస్థలో పాలసీదారులకు బోనస్ రేట్లను పెంచుతూ జిఎస్టి తొలగించి ఏజెంట్ల సమస్యలు పరిష్కరించాలని లియాఫి దేశవ్యాప్తగా ఆందోళన నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఇబ్రహీంపట్నం సాటి లైట్ బ్రాంచ్లో కండె మల్లేష్ ఆధ్వర్యంలో ఏజెంట్లతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  హెచ్ డి సి కార్యదర్శి  పోచయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ.. పాలసీదారులకు బోనస్ రేట్లు పెంచాలని అన్నారు, ఇన్సూరెన్స్ పాలసీ ల పై జిఎస్టి పూర్తిస్థాయిలో తొలగించాలన్నారు, పాలసీదారుల ఎల్ఐసి బాండ్ పై తీసుకున్న  లోన్ కు సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించాలి అన్నారు, నూతనంగా ఎల్ఐసి పాలసీ పొందినవారికి బాండ్లను పాత పద్ధతి ద్వారానే అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు, సిటిజెన్ చార్ట్ ను ప్రాంతీయ భాషలో ముద్రించి ప్రదర్శించాలి అన్నారు, ఐదు సంవత్సరాలు అంతకు పై ఉన్న పాలసీలు కూడా పునరుద్ధరణకు అవకాశం కల్పించాలన్నారు, జీవిత బీమా ఏజెంట్లకు గ్రాట్యుటి 20 లక్షల వరకు పెంచాలన్నారు, టర్మ్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఏజెంట్ల అందరికీ  కల్పించాల