మండల ఫశు వైధ్యాదికారి ఆద్వర్యంలో వైద్య శిబిరం

Published: Wednesday October 19, 2022
జన్నారం, అక్టోబర్ 18, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కల్, తిమ్మాపూర్ గ్రామపంచాయతిలలో మండల  పశువైధ్యాదుకారి డాక్టర్ శ్రీకాంత్ ఆద్వర్యంలో వైద్య సిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశువులకు లంపి స్కిన్ (ముద్ద చర్మ)వ్యాధి నివారణ  టీకాల కార్యక్రమాన్ని మంగళవారం తిమ్మాపూర్ గ్రామంలో 167 ఆవులు, 80 గేదెలు దూడెలు 30 లో వాక్సిన్ ఇవ్వడం జరిగిందని అయన తెలిపారు. అదేవిధంగా మండల పశు వైద్య కేంద్రం ఆవరణలో పొనకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని 140 ఆవులలో 70 గేదెలకు లంపీ స్కిన్ (ముద్ద చర్మ) వ్యాధి నివారణ వాక్సినేషన్ టీకాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ జాడి గంగధర్, స్థానిక పశు వైద్య సిబ్బంది సంజీవ్, సాగర్, కిషన్, వినోద్ పాల్గోన్నారు.