డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 114 వ జయంతి

Published: Wednesday April 06, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేది 5 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో  బాబుజగ్జీవన్ రామ్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన యువ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ అతిచిన్న వయసులోనే తొలిప్రధాని పండిట్ జవహర్లార్ నెహ్రూ ప్రభుత్వంలో కార్మిక శాఖామంత్రిగా, తరువాత కాలంలో కమ్యూనికేషన్స్, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం వంటి కీలక శాఖల బాధ్యతలను నిర్వహించారు. తరువాత కాలంలో భారత ఉపప్రధానిగా దేశానికి అద్వితీయమైన సేవలను అందించారు. దళితులకు రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ హక్కులను ప్రసాదిస్తే.. వాటిని చట్టరూపంలో అమలు చేసేందుకు జగ్జీవన్ రామ్ చేసిర హక్కులను రాజ్యాంగంలో అంబేడ్కర్‌ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్‌రామ్‌ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జడల రవీందరరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిది కొండ్రు ప్రవీణ్, కౌన్సిలర్స్ పంది శంకర్.. నరాల విశాల సాగర్.. సుల్తానా బేగామ్.. యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్ళ బాలశివుడు గౌడ్... ఇబ్రహీంపట్నం మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మంకాల కరుణాకర్.గౌస్.ఫెరోజ్.పెద్దిగారి శ్రీకాంత్. యాదగిరి.. సోప్పరి రవికుమార్. ఎన్ను భరత్ రెడ్డి. నంద కిషోర్. కిరణ్. జగన్. అమర్. వినోద్ పంది యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.