పేదవాడి కళ , తెలంగాణ ఆడపడుచులకు మేనమామ ఒక కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం తోనే సాధ్యం బూర్గంపాడు మ

Published: Wednesday November 23, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)
 
ఇల్లు కట్టి చూడు అనే సామెత ఊరికే రాలేదు.
ఒక సామాన్యుడు ఇల్లు కట్టాలన్నా తన బిడ్డకు పెళ్లి చేయాలన్నా అప్పుల పాలు కావాల్సిందే...ఈరోజుల్లో బిడ్డ పెళ్లి అంటే విందులకు వినోదాలకు మాత్రమే మొగ్గు చూపే రోజులు... కొంత సాయం చేయమని అడిగితే దూరం జరుగుతరు.అలాంటిది మన ముఖ్యమంత్రి  కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ప ,థకం ద్వారా ఆడబిడ్డల మేనమామ అయ్యి రాష్ట్రంలో 11.62 లక్షల మందికి లబ్ది చేకూర్చడం అంటే మాములు విషయం కాదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అంతేకాకుండా రైతుల కోసం రైతుబంధు ,దళితుల కోసం దళిత బంధు పెట్టిన మహానుభావుడని ఆయన ఈ సందర్భంగా అన్నారు. పేదవాడు సొంత ఇంటి కల కోసం మూడు లక్షల రూపాయలతో పేదవాడికి ఇల్లు నిర్మించబోతున్నారని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందిస్తున్నారని, 24 గంటలు కరెంటు నిర్విరామంగా అందిస్తున్నారని, రైతుల కోసం ఉచితంగా కరెంటు ఇస్తున్నారని వారు ఈ సందర్భంగా తెలిపారు