అమృత్ సరోవర్ పధకం కు చెరువుమాధారం ఎంపిక స్థలం ను పరిశీలించిన తహశీల్దార్, ఎంపీడీఓ.

Published: Thursday September 22, 2022
అమృత్ సరోవర్ పధకం కు చెరువుమాధారం ఎంపిక
 
స్థలం ను పరిశీలించిన తహశీల్దార్, ఎంపీడీఓ..
 
పాలేరు సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి
నేలకొండపల్లి
ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా (అమృత్ సరోవర్
నీటికుంటలు, చెరువులు) చెరువుమాధారం గ్రామం ఎంపికైంది. మండలం లోని చెరువుమాధారంలో ఎంపిక చేసిన స్థలం ను బుధవారం ఎంపీడీఓ కె.జమలారెడ్డి, తహశీల్దార్ దారా ప్రసాద్ లు పరిశీలించారు. పాలకవర్గంతో చర్చించారు. దాదాపు ఎకరం స్థలంలో మట్టి ని తవ్వి వర్షపు నీరు నిలిచేలా పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ట్యాంక్ నిర్మాణం కోసం జరిగే తవ్వకాల ద్వారా వచ్చే గ్రావెల్ అవసరం మేరకు జాతీయ రహదారి నిర్మాణ కు కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అమృత్ సరోవర్ ట్యాంక్ పనులను శర వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గతంలో మండలం లోని భైరవునిపల్లి, నాచేపల్లి. రాజేశ్వరపురం చెరువుల ను అమృత్ సరోవర్ ట్యాంక్లుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వీటి వలన భూగర్భజలాలు పెరుగుతాయనిపేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈవూరి సుజాత. సొసైటీ మాజీ
చైర్మన్ ఈవూరి శ్రీనివాసరెడ్డి, ఈజీఓస్ ఈసీ శేషరిగిరావు తదితరులు
పాల్గొన్నారు.