మిరియాల నారాయణ గుప్తా 129 వ జయంతి సందర్భంగా నివాళులు

Published: Saturday June 26, 2021

మధిర, జూన్ 25, ప్రజాపాలన ప్రతినిధి : తాలూకా రేమిడిచర్ల గ్రామంలో 1893వ సంవత్సరంలో బీద ఆర్య వైశ్య కుటుంబంలో జన్మించి బ్రతుకు తెరువు కోసం మధిరకు వచ్చి నివాసం ఏర్పరచుకొన్న మహా మనిషి మిరియాల నారాయణ గుప్తా గారు. ఆనాటి స్వాతంత్రోద్యమంలో స్వయంగా పాల్గొని నాటి నాయకులైన జలగం వెంగళరావు, శీలం సిద్ధారెడ్డి, బొమ్మకంటి వారలకు మార్గదర్శకంగా ఉండి దిశానిర్దేశం చేసిన మహనీయుడు శ్రీ మిరియాల నారాయణ గుప్తా గారు. ఆరోజుల్లో పూజ్య బాపూజీ తో బహిరంగ సభ ఏర్పాటు చేసిన గాంధేయవాది. స్వాతంత్రోద్యమంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబం వారిద మధిరలో వర్తక సంఘం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం, శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం, రిక్రియేషన్ క్లబ్, గర్ల్స్ హై స్కూల్, బాపూజీ హరిజన హాస్టల్ మరియు గ్రంధాలయం తదితర సంస్థలకు భావి తరాలకు ఉపయోగపడే విధంగా స్థల సేకరణ జరిపి మధిర ప్రజలకు అందించిన మహనీయుడు శ్రీ మిర్యాల నారాయణ గుప్తా. 1982 లో కీర్తి శేషులు అయ్యారు నారాయణ గుప్తా వారు మధిర సమాజానికి చేసిన సేవలను గుర్తించి శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో వారి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రతి సంవత్సరం జయంతి మరియు వర్ధంతి వేడుకలను జరుపుకుంటున్నారు శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం నిర్వహణ కమిటీ వారు వారు చేసిన సేవలు మధిర భావితరాలకు శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా మధిర- అంబారుపేట చెరువు కట్ట త్వరలో ట్యాంకుబండుగా మారబోతున్నందున ఆ ట్యాంక్ బండ్ కి శ్రీ మిరియాల నారాయణ గుప్తా ట్యాంకుబండుగా నామకరణం చేసి వారి పేరును భావితరాలు స్మరించుకునే విధంగా చేసినట్లయితే వారికి సముచిత గౌరవం కల్పించిన వారవుతారని భావిస్తున్నాము.  ఈరోజు శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలోని మిరియాల నారాయణ గుప్తా గారి విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవించుకుంటూ ఉన్న వేళ వారికి మా హృదయపూర్వక నివాళులు అర్పించిమరియు జోహార్లు ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ విద్యావంతులుగా రాజకీయవేత్తగా అనేక అనేక సేవలు తత్వంతో జిల్లాలోనే ఆర్యవైశ్య వైశ్యుడిగా జిల్లాలో మధిర నియోజకవర్గంలో అన్ని అర్హతలూ ఉన్న నాయకుడిగా గుప్తా గారు అనేక సేవా దృక్పథంతో ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు అనంతరం మదర్ లో అనేక కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమంలో మిర్యాల రమణగుప్తా రంగా హనుమంతరావు ఇరుకుళ్ళ లక్ష్మీనరసింహారావు, రంగా అప్పారావు, kuruvella కృష్ణచారుగుండ్ల నరసింహమూర్తి, పల్లపోతు ప్రసాద రావు, మిరియాల కాశీ విశ్వేశ్వర రావు, యర్రా లక్ష్మణ్, కుంచం కృష్ణారావు, ఇరుకుళ్ళ సురేష్, వెచ్చా వెంకటరంగారావు, పుల్లఖండం చంద్రశేఖర్ రిటైర్డ్ ఎండీపీ. నాగ గేశ్వరావు విశ్వనాధ