ఈ నెల 24న కెవిపిఎస్ ద్వితీయ మహాసభలు ** కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్

Published: Thursday July 21, 2022
ఆసిఫాబాద్ జిల్లా జూలై 20 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఈ నెల 24న జిల్లా కేంద్రంలో కెవిపిఎస్ ద్వితీయ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దినకర్ మాట్లాడుతూ కేబీ జిల్లా వ్యాప్తంగా 150 మంది ప్రతినిధులతో మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు దళితుల సంక్షేమం అభివృద్ధికి అనేక పథకాలు వాగ్దానాలు చేసి నేడు ఒకటి కూడా అమలు చేయడం లేదన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కలగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు జాడి మల్లయ్య మాట్లాడుతూ దళిత బంధు పథకం మొదటి విడతగా నియోజకవర్గానికి 100మంది కి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, రెండో విడతలో 5 వేల మంది దళితులకు పథకం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. మనువాద పాలిత ప్రాంతాలలో దళితులపై గిరిజనులపై దారుణంగా దాడులు, హత్యలు, చేస్తున్నారని అన్నారు. విద్య ఉపాధి వైద్యం కొరకై భవిష్యత్తులో మహా సభలో చర్చించి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో  కెవిపిఎస్ నాయకులు ప్రసాద్, ఆనంద్ లు పాల్గొన్నారు.
 
 
 
Attachments area