ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ ను నిర్మూలించాలి.. జేఎస్ఎస్ జిల్లా డైరెక్టర్ రాధాకృష్ణ..

Published: Tuesday July 26, 2022

తల్లాడ, జులై 25 (ప్రజాపాలన న్యూస్):

జనశిక్షన్ సంస్థాన్ ఖమ్మం ఆధ్వర్యంలో సోమవారం బోనకల్ మండలంలోని ముష్టికుంట్ల, సీతంపేట, నాగులవంచ గ్రామాలలో స్వచత పక్వాడ కార్యక్రమాలలో భాగంగాజె యస్ యస్ సెంటర్స్ లలో ప్లాస్టిక్ నిరోధం పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎస్ఎస్ జిల్లా డైరెక్టర్ వై. రాధాకృష్ణ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వలన అనేక నష్టాలు వాటిల్లి జీవనప్రమాణాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. విధిగా అందరు ఆరోగ్యాంగా ఉండాలని, మనపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మహిళలు, యువతీ, యువకులు పాల్గొని గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా చేయుటలో తమవంతు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమం లో జె యస్ యస్ లబ్ధిదారులు, స్టాఫ్,రిశోర్స్ పర్సన్స్ జాస్మిన్, యస్ కె. రజియా పాల్గొన్నారు.