వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం

Published: Thursday July 21, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధి

ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని వామపక్ష విద్యార్థి సంఘాలు  ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ  ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు బందు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో  ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి. శివకుమార్  పాల్గొని మాట్లాడుతూ ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టినటువంటి బందును విద్యార్థులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారని అన్నారు.  రాష్ట్రంలో నేడు విద్యారంగ సమస్యల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు పూర్తిస్థాయిలో అందించలేదని, ఇంటర్మీడియట్ కాలేజీల్లో కనీస వస్తువులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ,ప్రైమరీ హై స్కూల్ లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయలేదని ,ఇంతవరకు కనీసం పాఠశాలలో స్కావెంజర్స్ కూడా లేరని ,అదేవిధంగా ప్రైవేట్ ఫీజులు దోపిడీకి నియంత్రణ లేదని, ఐదేళ్లుగా స్కాలర్షిప్ లన్ని పెండింగ్ లోనే ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బతికించాలని అన్నారు.  మరెన్నో సమస్యలతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించి విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కావున ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిద్రమత్తు వీడి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని,  కార్పొరేట్ ప్రైవేట్ ఫీజుల దోపిడీ కి అడ్డుకట్ట వేయాలని స్కాలర్షిప్లను వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో  ఏఐఎస్ఎఫ్, తుర్కా యాంజల్ మున్సిపాలిటీ  అధ్యక్ష కార్యదర్శులు పల్లపు శివకుమార్, ప్రవీణ్,భాను,రాకేష్,  ఎస్ఎఫ్ఐ నాయకులు రాజేష్,  తదితరులు పాల్గొన్నారు.