పేదల భూములతో సీఎం కేసీఆర్ భూ దాహం

Published: Saturday September 24, 2022
చీమ చిటుక్కుమన్న స్పందించే పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది
* ఒంటరి వృద్ధులపై దాడి పిరికి వారి చర్య
* పులుమామిడి గ్రామ బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్
వికారాబాద్ బ్యూరో 23 సెప్టెంబర్ ప్రజాపాలన : రెక్కాడితే గాని  డొక్కాడని కష్టజీవులు నిరుపేదలు వ్యవసాయం చేసి బతుక కూడదా అని హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. శుక్రవారం నవాబుపేట మండల పరిధిలోని పులుమామిడి గ్రామానికి చెందిన బాధిత రైతు తెలుగు చంద్రయ్య కుటుంబ సభ్యులను హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర బిజెపి నాయకులు మాజీ మంత్రి డాక్టర్ ఎ చంద్రశేఖర్ వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద రెడ్డిలతో కలిసి బాధిత రైతు కుమారుడు తెలుగు రాఘవేందర్ ను దాడీకి సంబంధించిన వివరాలను తెలుసుకొని వృద్ధ రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ధరణి పేరుతో నిరుపేదలు పేదల భూములను లాక్కుంటున్నారని ఘాటుగా విమర్శించారు. బడుగు బలహీన వర్గాల బతుకులను విచ్ఛిన్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. చీమ చిత్తుక్కుబంటే స్పందించే పోలీసు వ్యవస్థ గాడి తప్పిందని స్పష్టం చేశారు. తెలుగు రాఘవేందర్ కు ఒకటిన్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. రాఘవేందర్ పొలము చుట్టు ఉన్న భూములను పులుమామిడి టిఆర్ఎస్ ఎంపిటిసి తేజస్విని భర్త రామకృష్ణారెడ్డి అతని సోదరుడు రెడ్డి వారి కుటుంబ సభ్యులు కలిసి కర్రలకు రాళ్లతో విచక్షణారహితంగా క్రూరంగా అమానుషంగి దాడి చేయడం హేయమైన చర్య అన్నారు దారి చేసిన టిఆర్ఎస్ ఎంపీటీసీ కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిలో ఐదు మంది ఉంటే కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేయడం టిఆర్ఎస్ ప్రభుత్వం  నిరంకుశ నియంత పాలనకు నిదర్శనం అని దెప్పి పొడిచారు. జిల్లా ఎస్పీ స్పందించి స్థానిక ఎస్సై భరత్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ రాష్ట్రానికి బదులుగా భూ ఆక్రమణధారుగా అవతరించిందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ గ్రామములో చూసినా టిఆర్ఎస్ రాజకీయ నాయకులకు అడ్డు అదుపు లేకుండా పోతుందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అండదండలు లేకపోతే వృద్ధ దంపతులపై దాడులు జరిగేవా అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధి అన్ని సామాజిక వర్గాలను సమాన దుష్తో చూడాల్సిన ఎఫ్ఎల్ఏనే తీర్చుకునే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు.
 
 
 
Attachments area