భువనగిరి లో ప్రపంచ ఒలింపిక్ డే రన్

Published: Friday June 24, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 23 జూన్ ప్రజాపాలన:
 
ప్రపంచ ఒలింపిక్ డే రన్ సందర్భంగా బేస్తవారం నాడు రోటరీ క్లబ్ మరియు ఇతర సంస్థల సహకారంతో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
భువనగిరి జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉదయం 07.00 లకు   యాదాద్రి భువనగిరి జిల్లా హాకీ అసోసియేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి పోర్ట్, డా.పద్మజ సంతాన సాఫల్య కేంద్రం, హబ్సిగూడా, హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ ఒలింపిక్ డే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు
కోమటిరెడ్డి మోహన్ రెడ్డి (సీనియర్ రోటరీ సభ్యులు,భువనగిరి)  జెండా ఊపి ప్రారంభించారు. పిదప అసిస్టెంట్ గవర్నర్ 22-23 రోటరీ క్లబ్ 3150 గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి  కాగడా జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి  ఒవైసీ ఖాద్రి,   భువనగిరి పట్టణ వాకర్స్ సోదరులు, నీలం రమేష్, రమేష్ రెడ్డి  చిన్నారులు విద్యార్థులు  పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు.