విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట

Published: Wednesday June 15, 2022
మేడిపల్లి, జూన్14 (ప్రజాపాలన ప్రతినిధి)
  ఉప్పల్ డివిజన్లోని బస్టాప్ వెనకాల మార్కేట్ కు వెళ్ళే మార్గంలో ప్రమాదకర స్థితిలో కరెంటు పోల్, స్థానికులు విద్యుత్ అధికారులకు మొర పెట్టుకున్న అలకించని విద్యుత్ అధికారులు, సమస్యను బీజేపీ దృష్టికి తీసుకురాగా బీజేపీ అధ్యక్షులు రెడ్డిగారి దేవేందర్ రెడ్డి కరెంటు పోల్ ను పరిశీలించి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది.ఈ సదర్భంగా రెడ్డిగారి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్రతి నిత్యం మార్కేట్ కు వెళ్ళే మార్గంలో కూలిపోయే స్థితిలో ఉన్న  కరెంటు పోల్ వర్షానికి కూలిపోయే ప్రమాదం ఉందని, దానివలన ప్రజలు ప్రమాద బారిన పడే అవకాశం ఉందని విద్యుత్ అధికారుల దృష్టికి ఫోన్ ద్వారా తీసుకుపోగా నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏదైనా జరగరానిది జరిగితే పూర్తి బాధ్యత విద్యుత్ ఏఈ మధు రంజన్ దే అని తెలియజేశారు. ప్రమాదకర స్థితిలో ఉన్న కరెంటు పోల్ ను వెంటనే మార్చకపోతే పెద్ద ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని అవసరమైతే విద్యుత్ శాఖ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కాబట్టి ఇప్పటికైనా విద్యుత్ అధికారులు నిద్రమత్తు వీడి తక్షణమే కరెంటు పోల్ ను మార్చాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులు వసూల మీద ఉన్న శ్రద్ధ విద్యుత్ సమస్యల మీద కూడ పెట్టాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వర్కల రాజేందర్ గౌడ్, సింగారం కార్తీక్, ఈదులకంటి నవీన్ గౌడ్, హర్షల సంపత్, స్థానికులు నక్క చంద్రయ్య, రాజు, దేవేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.