రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్ మరియు 12 మంది జవాన్లకు ఘన నివాళులు

Published: Saturday December 11, 2021

కోరుట్ల, డిసెంబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి): తమిళనాడు నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది రక్షణ జవాన్లు దుర్మరణం చెందడం భాదకరమని వారి ఆత్మకు శాంతి చేకూరలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ అన్నారు. శుక్రవారం సి ప్రభాకర్ స్మారక గ్రంథాలయంలో అధ్యక్షులు చెన్న విశ్వనాథం అధ్యక్షత జరిగిన సంతాప సభలో బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పేట భాస్కర్ మాట్లాడుతూ బిపిన్ రావత్ అపార ప్రతిభాశాలి అని టెర్రరిస్టులను ఎదుర్కోవడంలో ఆయన అనుసరించే వ్యూహాలు ప్రత్యర్థులకు అందవని కొనియాడారు. ఎన్నో యుద్ధాలు సారధిగా భారతదేశానికి అండగా నిలిచారని ఆయన ధైర్యసాహసాలకు ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నారు ఆయన మరణం దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు, వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాచకొండ దేవయ్య, సిపిఐ నేత ఎం రాధ, నాయకులు మల్లేశం, రాజేశం, రాములు, దశరథం ఈ గంగాధర్, న్యాయవాది శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.