సిపిఎం లో ప్రాణం పోయే వరకు నిలబడిన మహా పోరాటయోధుడు కృష్ణయ్య

Published: Tuesday June 21, 2022
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు 
 
  బోనకల్ , జూన్ 20 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామంలో ఇటీవల మరణించిన సిపిఎం సీనియర్ నాయకుడు మరీదు కృష్ణయ్య సంతాప సభ సిపిఎం రావినూతల గ్రామ కమిటీ కన్వీనర్ గుగులోతు పంతు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, మధిర రూరల్ మండల కార్యదర్శి మంద సైదులు కృష్ణయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ రావు, పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రావినూతల గ్రామంలో సిపిఎం అభివృద్ధికి, ప్రధానంగా గీత కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సుదీర్ఘమైన పోరాటాలు నిర్వహించాడని కొనియాడారు. కాంగ్రెస్ నాయకులు సిపిఎం ను అణచివేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారని, కృష్ణయ్య మాత్రం మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారని అన్నారు. సిపిఎం ప్రధాన ఆయు పట్టు గా ఉన్న గీత కార్మికుల పై అనేక రకాలుగా దాడులు చేశారని అయినా గీత కార్మికుల కు అండగా ఉన్నాడని కొనియాడారు. చివరకు గీత కార్మికుల జీవనాధారమైన తాటి, ఈత చెట్లను నరికి, మోతాదులను కాలబెట్టినా వేరవకుండా సిపిఎం జెండా పట్టుకొని నికరంగా ప్రాణం పోయేంతవరకు నిలబడిన మహా పోరాటయోధుడు కృష్ణయ్య అని కొనియాడారు. వ్యవసాయ పొలాలకు సాగర్ నీటిని రాకుండా కాలవలు పూడ్చినా భయపడకుండా ఎదురొడ్డి నిలబడిన ధైర్యవంతుడు కృష్ణయ్య అన్నారు. తొలితరం నాయకుడుగా ఉన్న కృష్ణయ్య తో తాను సిపిఎం ప్రారంభంలో కలిసి పని చేశానని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రావినూతల లో దొంగతనం కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన భూస్వాములు మల మల లాడే కాలే నీటిలో చేయి పెట్టాలని, కాలితే దొంగతనం చేసినట్లు, చేయి కాలకపోతే దొంగతనం చేయనట్లుని శిక్ష విధిస్తే ఆ శిక్షణ కు వ్యతిరేకంగా ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన యోధుడు కృష్ణయ్య అన్నారు. ఎన్ని సమస్యలు, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా సిపిఎం జెండా వదలకుండా కష్టజీవులకు అండ సిపిఎం జెండా మాత్రమేనని చాటిచెప్పిన గొప్ప నాయకుడు కృష్ణయ్య అన్నారు. బిజెపి ప్రభుత్వం అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకు వచ్చి దేశాన్ని, రక్షణ వ్యవస్థ ను నాశనం చేస్తుందని విమర్శించారు. రక్షణ రంగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో సైనికులను తీసుకుంటే అది దేశానికే ప్రమాదకరమని, వెంటనే అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్ని కోట్లు ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం వాళ్లే ఆ సంఘటన జరిగిందని, ఈ సంఘటన కు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. సామరస్యంగా పరిష్కారం చేయవలసిన సమస్యలను పాలకుల జటిలం చేస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుత సమాజానికి కృష్ణయ్య లాంటి వ్యక్తి ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ఎర్రగాని కోటయ్య, సిపిఎం రావినూతల శాఖా కార్యదర్శులు మందా వీరభద్రం, కొంగర భూషయ్య, మాజీ ఎంపిటిసి గండు సైదులు, సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు ,నవ తెలంగాణ జాబ్ వర్కర్ బుక్యా కృష్ణ, సిపిఎం మండల కమిటీ సభ్యులు బంధం శ్రీనివాసరావు, గూగులోతు నరేష్, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు చెడే వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు దొండపాటి సత్యనారాయణ, కొమ్మినేని పిచ్చయ్య, బూర్గుల అప్పాచారి, పిల్లలమర్రి వెంకట అప్పారావు, ఏసుపోగు బాబు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు మరీదు పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.