పలు కాలనీలను పర్యటించిన బడంగ్ పేట్ కార్పొరేషన్ కమిషనర్

Published: Friday July 23, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : పోచమ్మ, కోమటికుంటల కల్వర్టు ను ఓపెన్ చేయాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనీ కుండపోతగా కురుస్తున్న వర్షపు నీరు, చెరువులు పూర్తిగా నిండిపోవడంతో అల్మాస్గూడ లో ఉన్నటువంటి  పోచమ్మ, కోమటికుంట, ఎర్రకుంట లను కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి తో కలిసి అధికారులు ప్రజాప్రతినిధులు ముంపుకు గురయ్యే కాలనీలు 3వ డివిజన్ కార్పొరేటర్ మాధురి వీర కర్ణ రెడ్డి సమక్షంలో జంగారెడ్డి కాలనీ, రామిడి మల్లారెడ్డి కాలనీలను, పర్యటించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ.... వర్షపు నీరు కిందికి పోయే విధంగా తక్షణమే చర్యలు తీసుకునేలా యుద్ధ ప్రాతిపదికను, ఆ చెరువుల కల్వర్టులను తెరిచి నీరు పోయేటట్లు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఏ.ఇ లు బిక్కు నాయక్, రామ్ ప్రసాద్ రెడ్డి , మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు ఏనుగు రామ్ రెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, దీపిక శేఖర్ రెడ్డి, సం రెడ్డి వెంకట్ రెడ్డి, రామిడి సూరకర్ణ రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.