పాఠశాలకు తాళం వేసిన విద్యార్థులు

Published: Thursday June 30, 2022
బోనకల్, జూన్ 29 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందపురం (ఎల్) గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు బుధవారం పాఠశాల విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపినారు. స్కూలు ప్రారంభం నాటి నుండి ఇంతవరకు మాకు టీచర్లను భర్తీ చేయలేదని, మేము పాఠశాలకు వచ్చి మధ్యాహ్న భోజనం తింటానికి వచ్చి పోతున్నాము తప్ప చదువు చెప్పటానికి ఉపాధ్యాయులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మా పాఠశాలకు ఉపాధ్యాయులను భర్తీ చేసి మేము చదువుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించాలని, లేనియెడల మేము ఆందోళన విరమించమని, రోడ్డుపై స్కూల్ గేట్ దగ్గర గంటపాటు పిల్లలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎంసి చైర్మన్, గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు వినుతిపత్రం ఇచ్చిన కానీ పాఠశాల గురించి పట్టించుకోవడంలేదని, మా పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందని ఈ ఆందోళన చేయవలసిన అవసరం వచ్చిందని తెలియజేసినారు. పప్పు చారు అన్నం తినడానికా విద్యార్థులు వచ్చేది, చదువుకోటానికి అని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉపాధ్యాయులను భర్తీ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ కారంగు లక్ష్మణ్, గ్రామ సర్పంచ్ ఉమ్మ నేని బాబు, మాజీ ఎస్ఎంసి చైర్మన్ లక్ష్మణ్ ,వైఎస్సార్ పార్టీ నాయకులు ఇరుగు జానేష్, సిపిఎం నాయకులు ఉమ్మినేని రవి, కళ్యాణ్ శ్రీనివాసరావు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
 
డీఈఓను వివరణ కోరగా...... 
 
 ప్రభుత్వ ప్రకారం మేము ఫాలో అవుదామని అయినప్పటికీ ఈ ఆందోళనను పై అధికారుల దగ్గరకు పంపిస్తానని తెలియజేసినారు.సుమారు గంటసేపు ధర్నా చేసిన తర్వాత మండల ఎంఈఓ ఇందిరా జ్యోతి మీ పాఠశాలకు వెంటనే ప్రభుత్వ టీచర్లను రెండు రోజులలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత పిల్లలు ధర్నాను విరమించారు.