23 ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్

Published: Monday October 17, 2022

జగిత్యాల, అక్టోబర్, 16 ( ప్రజాపాలన ప్రతినిధి): పట్టణంలోని 23 మంది నిరుపేదలకు ఆపి రోటరీ క్లబ్ మరియు పావని కంటి ఆసుపత్రి అధ్వర్యంలో ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ చేసినారు. అనంతరం రోగులకు ఉచిత కంటిఅద్దాలు, మందులు  పంపిణీ చేసినారు. అనంతరం ఎమ్మేల్యే మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక అందత్వం కలిగిన వారు భారత దేశంలో ఉన్నారని అలాగే తెలంగాణలో సైతం అత్యధిక అందులు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కంటి వెలుగు లాంటి పథకాన్ని ప్రారంభించారని ఉచిత పరీక్షలు చేసి కంటి అద్దాలు అందజేశారని అన్నారు. కరోనా వల్ల కొంత ఆలస్యమైందని అన్నారు. కంటి చికిత్స చేసుకున్న రోగులు కంటిని కొద్ది రోజులుకాపాడుకోవాలని, సరైన సమయంలో మందులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డా.విజయ్, జిల్లా ఆర్ టిఎ మెంబర్ సుధాకర్ రావు, కౌన్సిలర్ పంభాల రామ్ కుమార్, వైస్ ఎంపీపీ.సురేందర్, రాయికల్ మండలం పార్టీ ఉప అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు నారాయణ గౌడ్, వెంకటేష్, వేణు, శ్రీనివాస్, రామ్మోహన్ రావు, గంగాధర్, ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.