*జాబ్ చార్ట్ ప్రకారమే విధులు నిర్వర్తిస్తాం*

Published: Saturday December 17, 2022

-చేవెళ్ల వీఆర్ఏ జేఏసీ నాయకులు

చేవెళ్ల,డిసెంబర్16 (ప్రజాపాలన):-

జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వహిస్తామని జాబ్ చార్ట్ ప్రకారంగా కాకుండా అధికారులు వివిధ రకాలైన పనులను బలవంతంగా వీఆర్ఏలచే చేయిస్తున్నందుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు శుక్రవారం చేవెళ్ల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా చేవెళ్ల వీఆర్ఏ జేఏసీ నాయకులు మాట్లాడుతూ... కామారెడ్డి జిల్లాలో విఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న నరేందర్ పై అధికారుల ఒత్తిడి వలన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జాబ్ చాటుకు విరుద్ధంగా పనులు చేసి ఇంటికి తిరిగి వెళ్లే సందర్భంలో ప్రమాదానికి గురై మరణించడం జరిగిందని దీనికి కారుకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పై అధికారులు వీఆర్ఏలకు సంబంధించిన పనులు మాత్రమే చెప్పాలని లేనిపక్షంలో ఇలాంటి ప్రమాదకర ఘటనలే జరుగుతాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్ఏలు అన్ని ఎమ్మార్వో కార్యాలయాల ముందు విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు. చేవెళ్ల ఎమ్మార్వో వీఆర్ఏలు బలవంతపు పనులు చేయించవద్దని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్లలోని ఎమ్మార్వో కార్యాలయంలో పనిచేస్తున్న శంకర్,సురేందర్, వెంకటయ్య,బషీర్,అంజి,నర్సింలు,భాగ్య, వీఆర్ఏలు పాల్గొన్నారు.