లాక్ డౌన్ పటిష్టంగా అమలు పోలీస్ కమిషనర్

Published: Monday May 17, 2021
మధిర, మే 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం దేశినేని పాలెంగ్రామంలాక్‌డౌన్‌ పక్కాగా అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. శనివారం మధిర మండలంలో దేశినేని పాలెం వద్ద గల ఆంద్రా తెలంగాణ సరిహద్దు వద్ద గల చెక్పోస్టు ను సందర్శించి పర్యవేక్షించారు. లాక్ డౌన్ అమలు తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా cp మాట్లాడుతూ అనవసరంగా ఎవరు బయట తిరగవద్దని, అత్యవసర పరిస్థితి ఉన్నవారు, వైద్య చికిత్స కోసం వచ్చే వారు మాత్రమే బయటికి రావాలని, బయటికి వచ్చేవారు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వెంట తెచ్చుకునాలన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా బయటకు వచ్చినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. వైరస్ వ్యాప్తి నివారణకు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి ప్రతి ఒక్కరు సహకరించాలనీ సీపీ అన్నారు. ఈ కార్యక్రమం లో మధిర ci మురళి.Si లు  సథీశ్ కుమార్, రమేశ్ కుమార్ పాల్గొన్నారు...