బిజెపి పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఐక్యము కావాలి ఎం సి పి ఐ యు పోలిట్ బ్యూరో సభ్యులు పల

Published: Wednesday September 07, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి:  దేశంలో మతోన్మాద ఫాసిస్టు బిజెపి పాలనకు వ్యతిరేకంగా, దోపిడీ, పాలకవర్గ బూర్జువా, పెట్టుబడిదారీ పార్టీలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఐక్యం కావాలని ఎం సి పి ఐ యు పోలిట్ బ్యూరో సభ్యులు పల్లెపు ఉపేందర్ రెడ్డి అన్నారు.
మంచిర్యాల జిల్లా పార్టీ కార్యదర్శి సబ్బని క్రిష్ణ అధ్యక్షతన మంగళవారం  బెల్లంపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు,
దేశంలో మతోన్మాద ఫాసిస్టు బిజెపిపాలనకు వ్యతిరేకంగా,దోపిడీ పాలకవర్గ బూర్జువా,పెట్టుబడిదారి పార్టీలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఐక్యం కావాలని , ఐక్యత సాధించే వరకు ప్రత్యామ్నాయ శక్తిగా కమ్యూనిస్టు వామపక్ష, సామాజిక సంఘటన నిర్మాణం ఏర్పడాలని అందుకు (యంసిపిఐయు) పార్టీ నిజాయితీగా కృషి చేస్తున్నదని అన్నారు. ఎంసిపిఐయు పార్టీ,ప్రజాసంఘాలు, ప్రజాసమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తుందని,ఈ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని ఆయన అన్నారు.
నవంబర్ లో జరుగు జాతీయ మహాసభలను నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రచారం చేసి జయప్రదం చేయాలని అన్నారు. జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ మాట్లాడుతూ
 సభ్యత్వం,ప్రజాసంఘాల నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం జరిగిందని తెలిపారు.
 ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కుంభం సుకన్య,నర్ర ప్రతాప్,గోనె కుమారస్వామి,జిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు సబ్బని రాజేంద్రప్రసాద్, కొండ శ్రీనివాస్,ఆరెపల్లి రమేష్,బర్ల స్రవంతి, కాంపల్లి రాధ,ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.