దేశవ్యాప్తంగా కాపులందరినీ ఐక్యం చేస్తాం - భారతీయ కాపు ఐక్య వేదిక

Published: Monday August 08, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
దేశవ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ప్రజలందరినీ ఏకం చేసేందుకు భారతీయ కాపు ఐక్యవేదిక కృషి చేస్తుందని జాతీయ అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు.  వేదిక మొట్టమొదటి సమావేశాన్ని ఆదివారం సోమాజిగూడలోని పర్యాటక భవన్ లో  నిర్వహించారు. ఈ సమావేశానికి నాయకులు చెల్లా హరి శంకర్, సుబ్రమణ్యం, చక్రపాణి రామకృష్ణ విజయబాబు, లక్ష్మి లత, రామ కుమార్ లు హాజరై వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా దేవయ్య మాట్లాడుతూ  ఐక్యవేదికను బలోపేతం చేసేందుకు ఇటీవలే లోగోను ఆవిష్కరించినట్లు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్న కాపు కులస్తులను గుర్తించి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు వేదిక కృషి చేస్తుందని చెప్పారు.  త్వరలోనే ఐక్యవేదిక ఆధ్వర్యంలో జాతీయస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వేదిక  ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ గా తోట రామ కుమారులు నియమించారు.
 
 
 
Attachments area