కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి.. --ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ర

Published: Monday December 19, 2022

జగిత్యాల, డిసెంబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి): సిపిఎస్ రద్దుకు ప్రత్యేక కమిటీ వేయాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జాదవ్ వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగుల బదిలీలు పదోన్నతులకు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వం వచ్చే సాధారణ ఎన్నికలలోపే బదిలీలు పదోన్నతులు మరియు సిపిఎస్ రద్దు గురించి ఒక ప్రత్యేక కమిటీ వేసి విధివిధానాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మన ఊరు మన బడి పథకం కింద గ్రామీణ ప్రాంతాల పాఠశాలలను ఎస్ఎస్సి వాడలలో ఉన్న పాఠశాలను ఆధునికరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టైబెల్టులు అదే విధంగా ప్రతి పాఠశాలలకు కంప్యూటర్లు ల్యాప్టాప్ లు అందజేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు విద్యార్థులకు సాంకేతిక విద్య ఆందేలాగా చూడాలని ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి నీలేటి ఎల్లయ్య, కరీంనగర్ ఇన్చార్జి జయరాం నాయక్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు బి రాజేష్ నాయక్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.