ఆక్రమణ దారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి : సిపిఎం డిమాండ్

Published: Tuesday April 05, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 4 ప్రజాపాలన ప్రతినిధి : తర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గ్రామంలో ప్రభుత్వ సర్వే నెం 44/1లో గతంలో 500 గజాల స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తే ప్రభుత్వ రెవెన్యూ అధికారులు కూలగొట్టారు. కానీ ఇప్పుడు అదే స్థలంలో మరల అదే వ్యక్తి కొంతమంది స్థానిక రాజకీయ నాయకుల అండదడలతో రేకులతో ఇంటి నిర్మాణం చేసి దానికి మనిసిపల్ అధికారుల అనుమతితో ఇంటి నెంబర్ కూడా పోందినాడు. ఈ రోజు ఆ అక్రమ కట్టడాన్నీ సిపిఎం తుర్కయాంజాల్ మున్సిపల్ కమిటీ  కన్వీనర్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు డి.కిషన్ మరియు పార్టీ నాయకులు కె.శ్రీ రామ మూర్తి, ఐ.భాస్కర్, యం.జె ప్రకాష్ కరత్, బి.మాలయద్రి, కె.సత్యనారాయణ తదతరులు సందర్శించినారు. ఇది కేవలం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలన జరిగింది కాబట్టి, వెంటనే అధికారులు విచారణ జరిపి అక్రమ కట్టడాల్ని శాశ్వతంగా తొలగించాలనీ మరియు ఆ భూమిని స్వాధీనం చేసుకొని ఆక్రమణ ధారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు.