డిస్పెన్సరీ లలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి

Published: Wednesday February 23, 2022
చీఫ్ మెడికల్ ఆఫీసర్ కి మెమోరాండం సమర్పించిన: టీబీజీకేఎస్ 
బెల్లంపల్లి ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి, మాదారం, మరియు బెల్లంపల్లి లోని ఏరియా హాస్పిటల్ లో కార్మికులకు మెరుగైన వైద్య సౌకర్యాలు  కల్పించాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావుకు టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు సెంట్రల్ కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రకాష్ రావులు  విజ్ఞప్తి చేశారు. మంగళవారంనాడు గోలేటి లోని డిస్పెన్సరీ సందర్శించడానికి వచ్చిన నూతనంగా నియమితులైన చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావును కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు, ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో ఉన్న గోలేటి లో తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు  కరీంనగర్ లేదా హైదరాబాద్ హాస్పిటల్ లకు సులువుగా రిఫరల్ చేసే అధికారం స్థానిక డాక్టర్లకు ఇవ్వాలని, మాదారం, బెల్లంపల్లి, హాస్పిటల్స్ లో స్పెషలిస్ట్ డాక్టర్ ల ను నియమించాలని , పారామెడికల్ సిబ్బందిని సరిపోయే విధంగా కేటాయించాలని, రోగులకు సరైన మందులు అందే విధంగా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ కార్మికులకు అందించిన తండ్రి కొడుకుల ఉద్యోగం కోసం నిర్వహించే మెడికల్ బోర్డు లను యధావిధిగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శౌరి, మెడికల్ ఆఫీసర్ స్టాలిన్, సీనియర్ స్టాఫ్ నర్స్ జయశీల, మరియు టీబీజీకేఎస్ నాయకులు పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.