మహాశివరాత్రి సందర్భంగా రామభక్త సీతా కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో కాటన్ బ్యాగ్స్ వితరణ

Published: Thursday March 03, 2022
మధిర మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మధిర శివరాత్రి జాతరలో భాగంగా బుధవారం నాడు మధిర సేవ సమితి ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని రామభక్త సీతయ్య కళాపరిషత్ ఆధ్వర్యంలో కలిసి, కాటన్ బాగ్ ల వితరణ చేయటం జరిగింది, రెండవ రోజు కూడా జరిగింది. అనంతరం ఈ సందర్భంగా మధిర సేవా సమితి ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ శివాలయం ప్రాంగణంలో భక్తులకు, చిరువ్యాపారులకు, ప్లాస్టిక్ వాడకం వల్ల అనర్ధాలు, చెట్ల పెంపకం వలన లాభాలు, అవయవ ధానం ఆవశ్యకత, చనిపోయాక కళ్లు దానం మొదలైన విషయాల పట్ల అవగాహన కల్పించారు. అనంతరం శివరాత్రి సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేయటం రామ భక్త సీత కళాపరిషత్ వారికి అభినందనలు తెలుపుతూ ముందు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మధిర సాంస్కృతిక సారధి, రామభక్త సీతయ్య కళాపరిషత్ సెక్రటరీ బాబ్లా, మధిర సేవాసమితి ఉధ్యక్షులు కోమటీడు శ్రీనివాస రావు, చిరు వ్యాపారుల అధ్యక్షులు, జర్నలిస్టు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ బాణాల శంకరాచారి, విధుల్లో ఉన్న ఆరోగ్య శాఖ సిబ్బంది, జానపద కళాకారులు లంకా కొండయ్య మొదలైన వారు పాల్గొన్నారు.