అన్న దానాలకు అంటే అన్నదానం మిన్న

Published: Wednesday December 14, 2022
మధిర డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సేవ సదనంలో సీనియర్ జర్నలిస్ట్ సాక్షి విలేేకరు  అట్లూరి సాంబిరెడ్డి సేవా సదనంలో  అన్ని దానాలు కంటే అన్నదానం నిన్న అని సేవాా సదనంనిలయంగా మధిర ఖ్యాతి గడించిందని మధిర ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాగి బాలస్వామి పేర్కొన్నారు. ప్రవాస భారతీయులు అట్లూరి సాయి ప్రకాష్ రెడ్డి నిఖితా రెడ్డి వివాహ వార్షికోత్సవ సందర్భంగా మధిర వసంతమ్మ మానసిక వికలాంగుల సేవాసదనంలో సీనియర్లు విలేకర్ అట్లూరి సాంబిరెడ్డి లీలావతి దంపతుల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చేందుకు మధిరలో ఉన్న అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావటం ఎంతో అభినందనీయం అన్నారు. జన్మదినోత్సవం వివాహ వార్షికోత్సవాలు  సందర్భంగా డాక్టర్ వసంతమ్మ మానసిక వికలాంగుల కేంద్రం వద్ద అన్న దానాలు ఏర్పాటు చేస్తున్న దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అట్లూరి సాయి ప్రకాష్ రెడ్డి నిఖితా రెడ్డి దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయులు దుబాసి రాజేష్,కేర్ టేకర్ కుమార్ పాల్గొన్నారు.