తాహసిల్థార్ కార్యాలయానికి తాళం వేసి విఅర్ఎల నిరసన.

Published: Tuesday October 11, 2022
జన్నారం, అక్టోబర్ 10, ప్రజాపాలన: 
 
 విఅర్ఏ  రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని తాహసిల్థర్ కార్యాలయం ముందు తమ సమస్యలు పరిష్కరించాలని సోమవారం 77వ రోజు వివిధ గ్రామాల చెందిన విఅర్ఎలు తాహసిల్థార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపి తాహసిల్థార్ ఇట్యాల కిషన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల విఅర్ఏ సంఘం అధ్యక్షుడు జగ్గిషేట్టి రాజశేఖర్ మాట్లాడుతూ విఅర్ఎలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామిలాని చెప్పి, వాటిని అమలు చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. విఅర్ఏ సమస్యలు పట్టించుకోకుండా వదిలేసిందని వారి ప్రదాన డిమాండ్లు అయిన  పే, స్కేల్, జీవోను వేంటనే విడుదల చేయాలని, అర్హత గల విఅర్ఏ లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, యాబైఐదు సంవత్సరముల పైబడిన విఅర్ఏ స్థానంలో వారసులకు ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వానికి విఅర్ఎలు చేసే సరైన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యాక్రమంలో విఅర్ఏ మండల ఉపాధ్యక్షుడు దాసండ్ల రాజలింగు, ప్రధాన కార్యదర్శి కాసారపు శీనివాస్, కోశాధికారి బోడ్డు రాజుకుమార్,  ప్రచార కార్యదర్శులు గుమ్ముల శ్రీనివాస్, ముగ ప్రసాద్, మగ్గిడి దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.