తెగిపోయిన గొర్రెపల్లి కొత్త చేరువుకు మరమ్మత్తు పనులు ప్రారంభం

Published: Tuesday June 28, 2022
మల్లాపూర్, జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామ కొత్త చెరువు పోయిన వర్షాకాలం కురిసిన భారీ వర్షాలకు 2చోట్ల పూర్తిగా తెగిపోయింది. చెరువుకు తూర్పు వైపున తెగిపోయిన చోట సుమారు 200 మీటర్ల దూరం పొడవునా లెవెలింగ్ డౌన్ సమస్య కూడా ప్రధాన అంశం, కావున అట్టి చెరువు కట్టకు సంబంధించిన అన్ని మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం సోమవారం చెరువు కట్ట మరమ్మత్తు పనులను జెడ్పిటిసి సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపిపి కాటిపల్లి సరోజన ఆదిరెడ్డి, ఎఎంసి చైర్మన్ కదుర్క నర్సయ్య కలిసి పనులను ప్రారంభించారు. జెడ్పిటిసి మాట్లాడుతూ వ్యవసాయ పనులు ప్రారంభం అవుతున్న సమయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సదరు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొంపల్లి సరోజన రాజ విష్ణు, తహసీల్దార్ రవీందర్, ఎలేటి వెంకటరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.