ధర్జాగా భూ కబ్జా - చర్యలు తప్పవంటున్న తహశీల్దార్

Published: Friday February 12, 2021

11 ఫిబ్రవరి, ప్రజాపాలన,  క్యాతన్పల్లి: క్యాతన్పల్లి గ్రామపంచాయితీ రూపాంతరం చెంది మున్సిపాలిటీగా ఏర్పడ్డ అనంతరం 25 సంవత్సరాల క్రితం ఉన్నామంటూ కొందరు ఇండ్లు కూల్చి కుప్పలేస్తూ దౌర్జన్యం చేస్తుంటే, మరికొందరు దర్జాగా రోడ్డు ప్రక్కనే భూమి కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నా ఓ ఏజన్సీ ఘనుడు. వివరాల్లోకి వెళ్తే పురపాలక సంఘం జోడిపంపులు సమీప కటిక దుకాణాల ప్రక్క న భూమి కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నాడు. విషయంపై మందమర్రి తహశీల్దార్ను వివరణ కోరగా పలుమార్లు పురపాలక సంఘంలో కబ్జాలకు పాల్పడుతున్న విషయం దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నరు. కబ్జా లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ సిబ్బంది ఎప్పటికప్పుడు అక్రమ కట్టడాలను అరికట్టేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుంటున్నారని గుర్తు చేశారు.