మధిర గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్లు డెప్యూటేషన్ ను వెంటనే రద్దు చేయాలని అఖిలపక్ష పార్టీ

Published: Thursday April 29, 2021
మధిర, ఏప్రిల్ 28, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలో కరోనా కోరలు చాచుతూ విజృభిస్తున్న తరుణంలో మధిర గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ ని డెప్యూటేషన్ మీద పంపటం సరైన విధానం కాదు అని.. వెంటనే వాళ్ళ డెప్యూటేషన్ రద్దు చేసి మధిరలో కొనసాగేలా చూడాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్, సీపీఐ నాయకులు బెజవాడ రవి, పట్టణ బీజేపీ అధ్యక్షులు పాపట్ల రమేష్ కోరారు.. మధిర గవర్నమెంట్ హాస్పిటల్ లో వసతులను చూసి నిర్గాంతపోయారు.. అక్కడే చిన్న పిల్లల టీకాలు, అక్కడే కవిడ్ టెస్టింగ్, టీకాలు, సీజనల్ వ్యాధిలకుచికిత్సచేయటంబాగాలేదని.. అన్నారు.. ప్రతి ఒక్కరికి టీకా వేయాలి, మధిరకీ వచ్చే వాక్సిన్ పెంచాలి అనివెంటనే covid సెంటర్ ను, tvm స్కూల్ కి కానీ, మార్కెట్ యార్డ్ కు కానీ మార్చాలి ఆని Dmho గారికి ఫోన్ లో తెలియచేసారు. ఖమ్మంలో పాత బస్టాండ్ ను covid సెంటర్ గా మార్చినట్లు.. మధిర మార్కెట్ యార్డ్ కు covid సెంటర్ మార్చాలి అని ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్, సీపీఐ నాయకులు బెజవాడ రవి, బీజేపీ పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్, పట్టణ మైనార్టీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు షైక్ జహంగీర్, యూవజన కాంగ్రెస్ నాయకులు నవీన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కర్నాటి రామరావు మొదలగు వారు పాల్గొన్నారు.