మల్లారంలో రితువేదిక

Published: Thursday July 01, 2021
మధిర, జూన్ 30, ప్రజాపాలన ప్రతినిధి : మధుర 30వ తేదీ మధిర మండలంవరి విత్తనాలు నేరుగా దమ్ములో వెదజల్లే పద్దతి పై పాటించవలసిన మెలుకువలు, తగు సూచనలను మరియు పత్తిలో పాటించవలిసిన సమగ్ర సస్య రక్షణ చర్యలు గురించి మండల వ్యవసాయ అధికారి DNK శ్రీనివాసరావు రైతు వేదిక మల్లారం నందు వివరించడం జరిగింది అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంప్రదాయ వరి సాగులో నారు పోయడం, నాట్లు వేయడం మరియు కూలీల అవసరం కలదు. కానీ వెదజల్లే పద్దతి లో కూలీ ఖర్చు, నారు ఖర్చు మరియు సమయాన్ని అధిగమించవచ్చు.. మన ప్రాంతానికి అనువైన వంగడాలు. దీర్ఘకాలిక రకాలు150 రోజులుసాంబ మసూరి, సిద్ధి మధ్య కాలిక రకాలువరంగల్ సాంబ, వరంగల్ సన్నాలుస్వల్ప కాలిక రకాలుతెలంగాణ సోన RNR 15048విత్తే సమయంజులై 10 లోపు విత్తనం చల్లుకోవాలివిత్తన మోతాదుసాంప్రదాయ పద్దతిలో ఎకరాకు 25 కేజీల విత్తనం అవసరం కానీ ఈ పద్దతిలో కేవలం 8 నుంచి 12 కేజీల విత్తనం సరిపోతుంది. ఈ విధానంలో విత్తన ఖర్చు తగ్గించవచ్చువిత్తన శుద్ధి ప్రాముఖ్యత మరియు అనుసరించే విధానం.విత్తన శుద్ధితో నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను, చీడపీడలను నిరోధించడమే కాకుండా మొలకశాతాన్ని పెంచవచ్చుఅదేవిధంగా లీటర్ నీటికీ 1 గ్రా కార్బండిజమ్ కలిపి ఆ మిశ్రమంలో విత్తనాన్ని ఉంచి 24 గంటలు మండే కట్టి ఆ తరువాత విత్తనం ముక్కు పగలగానే దమ్ము చేసిన వరి పొలంలో చల్లాలి... ఎరువుల యాజమాన్యం సాధారణంగా నత్రజని ఎరువులను దమ్ములో, పిలక దశలో, చిరుపొట్ట దశ లో వేసుకోవాలి. భాస్వర ఎరువులను మొత్తం దమ్ములో వేయాలి. పోటాష్ ఎరువులను దమ్ములో సగం, అంకురం దశలో మిగతా సగం వేయాలి. ఎకరాకు  60-20-16 కేజీల N-P-K వాడవలసి ఉంటుందికలుపు యాజమాన్యం. ప్రధాన పొలంలో విత్తనాన్ని జల్లిన వెంటనే 1 నుంచి 2 రోజుల వ్యవధిలో పైరజోసల్ఫయురాన్ 80 గ్రా 200 లీటర్ నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేయడం ద్వారా కలుపు సమస్యను అధిగమించవచ్చు. 15 నుంచి 20 వ్యవధిలో గడ్డి జాతి కలుపు మొక్కల నివారణకు సైహలోఫాప్ బ్యుటైల్ 400 మిలీ ఎకరాకు పిచికారీ చేయాలి.. నీటి యాజమాన్యం. వరి పంటకు చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టి పడే వరకు నీటి తడులు ఇస్తూ ఉండాలి..సస్యరక్షణ.సాధారణంగా పిలక దశలో కాండం తొలిచే పురుగు సమస్య వుంటుంది కావున వాటి నివారణ కు కోరాజిన్ 0.3 మిలీ/లీ నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.. సుడి దోమ నివారణ కు బ్యుప్రోఫ్యూసిన్ 600 మిలీ 200 లీ నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చెయ్యాలి లాభా ఈ విధానంలో సాగు చేయడం ద్వారా రైతులకు సుమారు 7500 రూ వరకు ఖర్చు తగ్గుతుంది, నీటి వినియోగాన్ని 30-35% శాతాన్ని తగ్గించవచ్చు, 10 నుంచి 15  రోజుల ముందుగా పంట కోతకు వస్తుంది మరియు 5 నుంచి 8 శాతం అధిక దిగుబడులు సాధించవచ్చు. అలాగే వరిలో మిగిలిన సాగుపద్దతులైన మెట్ట వరి సాగు, డ్రమ్ సీడర్, శ్రీ పద్దతి గురించి మరియు పత్తిలో సమగ్ర సస్య రక్షణ చర్యలు గురించి మల్లారం వ్యవసాయ విస్తరణ అధికారి K.వంశీ కృష్ణ సాయి గారు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి(AO) DNK శ్రీనివాసరావు గారు, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) వంశీ కృష్ణ సాయి, మల్లారం గ్రామ సర్పంచ్ మందడపు ఉపేంద్ర రావు గారు, జాలిముడి సర్పంచ్ తడికమల్ల ప్రభాకరరావు గారు, గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు మందడపు రామకృష్ణ, బొగ్గుల కృష్ణారెడ్డి, మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు...