స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లను పెంచాలి

Published: Thursday August 18, 2022
మంచిర్యాల టౌన్, ఆగష్టు 17, ప్రజాపాలన : స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లను పెంచలాని కోరుతూ బుధవారం                      రోజున మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్కులో బిసి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మౌనదీక్ష నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రజనాభాలో 56 శాతం బిసి జనాభా ఉంటే స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం కేవలం 24 శాతం మాత్రమే అమలు చేయడం అంటే బిసి ల పై వివక్షత కొనసాగుతుందని అన్నారు.  24 శాతం రిజర్వేషన్ల కు చట్టభద్యత  లేకపోవడం, ఈ ప్రభుత్వానికి బిసిల పై  ఎంత ప్రేమ ఉందొ అర్ధమౌతుంది. రాష్ట్రంలో గత 40 సంవత్సరాలుగా  బి సి వాటా కవాలని, ఉద్యమాలు నడుస్తున్న నేపథ్యంలో, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల బిసి రిజర్వేషన్లు 34 శాతంగా ఉంటే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన  తెరాస ప్రభుత్వం రాత్రకి రాత్రే ప్రత్యక ఆర్డినేన్స్ తీసుకొచ్చి 10 శాతం రిజర్వేషన్లు తగ్గించడం అంటే బిసిలను, కనీసం సర్పంచ్, ఎం పి టి సి, జడ్పీటీసీ లు గా కూడ ప్రభుత్వం చూడలేకపోతుంది అన్న విషయం బిసి సమాజం గమనించలని అన్నారు. ఇప్పటికైనా స్థానిక సంస్థల బిసి రిజర్వేషన్ల ను 56 శాతం పెంచి వాటిని ఎ బి సి డి గ్రూపులు గా వర్గీకరించి చట్టభద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బిసి లను ఏకం చేసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈకార్యక్రమం లో  బిసి సంఘాల ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్, కో కన్వీనర్ సంగం లక్ష్మణ్, నాయకులు దూలం రాజేందర్, నేన్నెల నర్సయ్య, ఇన్నారం కిరణ్, ఆరెందుల రాజేశం, కూనరాపు చెందు, గుమ్ముల లింగయ్య, రాసామల్లా కుమార్, ధర్మాజీ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.