జీ.ఓ. నం.76 సర్వే పారదర్శకంగా నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్

Published: Wednesday January 11, 2023
 మంచిర్యాల బ్యూరో, జనవరి 10, ప్రజాపాలన  :
 
సింగరేణి భూములలో ఏండ్ల తరబడి నివాసం ఉంటున్న ప్రజలకు భూములు క్రమబద్దీకరించి యాజమాన్య హక్కు కల్పించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీ.ఓ. నం.76లో భాగంగా అందిన దరఖాస్తులపై పారదర్శకంగా సర్వే నిర్వహించి నివేదిక అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వేణు, శ్యామలాదేవి, ఎస్.ఎల్.ఆర్. ఎ.డి. శ్రీనివాస్ తో కలిసి సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జీ.ఓ. నం. 76 క్రింద భూమి కొలతల కొరకు అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తులకు సంబంధించి కొలతల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.