సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ.కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మీ రమేష్

Published: Tuesday September 27, 2022

మధిర  సెప్టెంబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి రాష్ట్రంలో ఆడపడుచులందరికీ సారెగా బతుకమ్మ చీరలు అందించడం జరుగుతోందని మున్సిపల్ కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మీ రమేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలను సోమవారం ఆమె మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ పాలనలో మహిళలకు సముచిత గౌరవం దక్కిందని ఆమె అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని అందరు కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆమె కోరారు. మహిళలకు పెద్ద పీట వేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అందులో భాగంగా ఆడపిల్ల పెళ్లికి అందించే కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలు దేశంలో ఎక్కడ లేవని ఆమె స్పష్టం చేశారు. అలానే కేసీఆర్ కిట్టు తో పాటుగా మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు లాంటి ఎన్నో పథకాలు మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆమె గుర్తు చేశారు. ఎనిమిది ఏండ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం విషయంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి అందరూ అండగా నిలవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఎర్రగుంట రమేష్ తదితరులు పాల్గొన్నారు.