10వ డివిజన్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభోత్సవం

Published: Tuesday July 06, 2021
మేడిపల్లి, జూలై 5 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ వెస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ బొమ్మక్ సుగుణ బాలయ్య సోమవారం నగర మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా డివిజన్లో కార్పొరేటర్ సుగుణ బాలయ్య డివిజన్ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటా మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోమ్మకు బాలయ్య, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు వెల్లంకి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి బైర బోయిన మల్లేశ్, కోశాదికారి ఉన్నం వెంకటేశ్, వెంకట్ వర్మ, నాగరాజు, జాన్వెస్లి తదితరులు పాల్గొన్నారు.