భువనగిరి లో రచయిత సుద్దాల అశోక్ తేజ కావ్య పఠనం

Published: Monday December 12, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 11 డిసెంబర్ ప్రజాపాలన:

ప్రముఖ కవి, ప్రముఖ సినీ గేయ రచయిత  డా. సుద్దాల అశోక్ తేజ కావ్య పఠనం "నేను అడవిని మాట్లాడుతున్నాను" కార్యక్రమం  జీనియస్ స్కూల్, భువనగిరి పట్టణములో ఆదివారం నాడు రోటరీ క్లబ్ భువనగిరి ఆధ్వర్యంలో సాయంత్రం

జరిగినది. ఈ సందర్భంగా  సుద్దాల అశోక్ తేజ  కావ్య పఠనం  చేస్తూ  అడవులను, చెట్లను, అడవి జంతువులను సంరక్షించాలని అలానే ప్రేమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో   బండారు శ్రీనివాసరావు అధ్యక్షులు, గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి  అసిస్టెంట్ గవర్నర్, యాదాద్రి భువనగిరి జిల్లా సిడబ్ల్యుసి చైర్  పర్సన్ బండారు జయశ్రీ,  కార్యదర్శి కరిపే నర్సింగ్ రావు, ఎన్నిక  అసిస్టెంట్ గవర్నర్  చెన్న లక్ష్మణ్, మాజీ అధ్యక్షులు శెట్టి బాలయ్య యాదవ్, కొక్కలకొండ నిమ్మయ్య,  ప్రముఖ రచయిత పోరెడ్డి రంగయ్య, క్లబ్ డైరెక్టర్స్  పలుగుల ఆగేశ్వరరావు, కోశాధికారి బోగా హరికృష్ణ, క్లబ్  సభ్యులు కూచిపట్ల సత్యనారాయణ రెడ్డి, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు ఇటిక్యాల  లావణ్య, ఇన్నర్ క్లబ్ సభ్యులు, సాహితీ ప్రియులు, రచయితలు  తదితరులు పాల్గొన్నారు.