ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి **పట్నంలో ప్రశాంత్ కుమార్ రెడ్డి కి ఘన స్వా

Published: Monday February 20, 2023

  ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 29వ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు  ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) ఆదివారం నాడు   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోకి ప్రవేశించగానే మహిళలు మంగళహరతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.  ప్రతి వార్డులోని కాలినికి  వెళ్లి, గడపగడపకు తిరుగుతూ  ముఖ్యమంత్రి కేసీఆర్   నాయకత్వంలో, ఎమ్మేల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను వివరిస్తూ  ప్రజలకు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో పాదయాత్ర చేస్తున్న సంధర్బంలో ముస్లీం మైనార్టీలను కలిశారు వారికి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరిస్తూ. వారి సమస్యలను తెలుసుకున్నారు. అదేవిధంగా గౌడ సోదరులను కూడా కలిశారు. అదేసంధర్బంలో గౌడ సోదరులు కల్లు తీసే సమయంలో ఉపయోగించే మోకును బంటి  ధరించారు.మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీ, శానిటేష్ వంటి అభివృద్ధి పనులు చేశామని అదేవిధంగా మండల కేంద్రం నుంచి ఇతర గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణ చేశామని, ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్నామని, పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మీ పథకంతో 1,0116 రూపాయలను, గర్భిణీలు స్త్రీలు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అయిన తర్వాత ఆడబిడ్డ పుడితే 13వేలు, మగబిడ్డ పుడితే 12వేల రూపాయలు అదేవిధంగా చంటిపాపకు కేసీఆర్ కిట్ ఇస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పనులు చేస్తామని బంటి  అన్నారు. ప్రగతి నివేదన యాత్రలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల్ వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు చిలకల బుగ్గరాములు, ఎంపీపీ కృపేష్ కౌన్సిలర్స్ భానుబాబు, జగన్, సుజాత రవీందర్, సుధాకర్, మమత శ్రీనివాస్ రెడ్డి, పద్మ మల్లేష్ యాదవ్, ప్రసన్నలక్ష్మీ చిన్న, రమేష్, జగదీష్, శ్వేత బాలు, బాలరాజు, కో-ఆప్షన్ మెంబర్ మోయిజ్ పాష, ఎండీ మోబీన్, కిరణ్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు జెర్కోని రాజు, సీనియర్ నాయకులు మల్లేష్ గౌడ్, అంజి రెడ్డి, భరత్ కుమార్,  రైతు సంఘం మున్సిపల్ అధ్యక్షులు తెల్జురి బాలరాజు బీవైఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.