వర్సరీలో బ్యాగ్ ఫిల్లింగ్ త్వరగా పూర్తి చేయాలి : ఎంపిడిఓ వెంకట్ రామ్ గౌడ్

Published: Wednesday December 01, 2021
వికారాబాద్ బ్యూరో 30 నవంబర్ ప్రజాపాలన : నర్సరీలో మిశ్రమ మట్టితో బ్యాగులను ఫిల్లింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని మర్పల్లి మండల ఎంపిడిఓ వెంకట రామా గౌడ్ కార్యదర్శికి సూచించారు. మంగళవారం మర్పల్లి గ్రామ పంచాయతీని ఎంపీడీఓ వెంకట్ రాం గౌడ్ నర్సరీని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ ఎర్రమట్టి, నల్ల మట్టి కలిపి జల్లెడ పట్టించే పనులను పరిశీలించామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డిఆర్ డిఓ లు ఈ నెల 4వ తేదీ వరకు బ్యాగ్ ఫిల్లింగ్ పూర్తి కావాలని శుక్రవారం వీక్లీ రివ్యూలో ఎంపీడీఓ ల కు అదేశించారని గుర్తు చేశారు. అనంతరం అవెన్యూ ప్లాంటేషన్, ఎంఎల్ఏపి మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్నట్లు కార్యదర్శి తెల్పారు. ట్యాంకర్ పేమెంట్  వాచర్ పేమెంట్ వెంటనే చెల్లించి, మస్టర్ సబ్మిట్ చేయలని కార్యదర్శికి సూచించారు. తరువాత గ్రామ పంచాయతి 7 రిజిష్టర్లు తనిఖీ చేయడమైనదని వివరించారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. లేబర్ రిపోర్ట్ 50 మంది కచ్చితంగా ఉండే విధంగా చూడాలని డిఆర్డిఓ తెల్పారని అన్నారు. లేని ఎడల చర్య తీసుకొనపడునని హెచ్చరించారు. తదుపరి క్రిమిటోరియం ఎస్బిఎం షెడ్ సెరిగేషన్ షెడ్ తడి చేత పొడి చెత్త తరలించాలని తెల్పాడు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్మి కాంత్, కారోబార్ ముబిన్ నాయకులు కలిమోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కస్తూరీబా గాంధి పాఠశాల విజిట్ చేసి కరోన థర్డ్ వే ఎదుర్కోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్, భౌతిక దూరం తప్పక పాటించాలని హితవు పలికారు. బయటి వారిని పిల్లల తల్లిదండ్రులను లోపలికి రానివ్వద్దని చెప్పారు. బయట నుండి మాట్లాడి పుంపించాలని స్పెషల్ ఆఫీసీర్ శైలజ కు తెల్పారు.