విద్యాలయాలకు శానిటైజర్ మాస్కులు పంపిణీ

Published: Saturday February 06, 2021
మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపాలన ) : కోవిడ్ 19 బారిన పడకుండా తగు రక్షణ చర్యల్లో భాగంగా విద్యార్థులకు శానిటైజర్, మాస్కులు పంపిణీ చేశామని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గత 11 నెలలుగా కోవిడ్ కారణంగా పాఠశాలలు, కాలేజీలు బంద్ అయిన విషయం అందరికీ విదితం. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం అయ్యాయి. కరోనా వైరస్ మరోసారి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా తన సొంత డబ్బులతో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా డీఈఓ రేణుకాదేవి,  కౌన్సిలర్లు చందర్ నాయక్, సుధాంష్ కిరణ్ పటేల్, మేక పావని చంద్రశేఖర్ రెడ్డి, పల్గుట్ట ప్రవళిక క్రిష్ణ, షరీఫ్, కో అప్షన్ సభ్యుడు రాజమల్లు, టిఆర్ఎస్ నేతలు శేఖర్ రెడ్డి, దత్తు, కడియాల వేణుగోపాల్ ముదిరాజ్, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.