లోక కళ్యాణార్థం అతి రుద్రమహాయజ్ఞం వికారాబాద్ బ్యూరో 12 డిసెంబర్ ప్రజాపాలన :

Published: Tuesday December 13, 2022

లోక కళ్యాణార్థం  అతి రుద్ర మహా యజ్ఞం డిసెంబర్ 21 నుండి 27 వరకు నిర్వహించనున్నామని ఆధ్యాత్మిక సేవాసమితి మండలి జ్యోషి సుభాష్ చంద్రకాంత్ శర్మ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని చిగుళ్ళపల్లి మైదానంలో  ఆధ్యాత్మిక సేవా సమితి మండలి ఆధ్వర్యంలో  మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితారౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గత 11 సంవత్సరాలుగా రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామని చెప్పారు.

 విశ్వ కళ్యాణమనే ఉదాత్తమైన భావన చేత ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించుచున్నాము. రుద్రాభిషేకం, బిల్వార్చన,  నామ సంకీర్తన మహోత్సవంలో భాగంగా శ్రీ మహాగణపతి శత చండి రాజశ్యామల మహా సుదర్శన అతిరుద్ర మహా యజ్ఞ సహిత మహోత్సవములు నిర్వహించనున్నామని వివరించారు. ప్రతిరోజు పంచాక్షరి మంత్ర అఖండ నామ సంకీర్తన అఖండ సంతత ధారాభిషేకము అఖండ భజన కార్యక్రమము లలితా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణములు భగవద్గీత పారాయణములు కుంకుమార్చనలు సాంస్కృతిక కార్యక్రమాలు మహనీయుల అనుగ్రహ భాషణములు ప్రవచనములు అన్నప్రసాద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ధర్మరక్షణకు చేపడుతున్న బృహత్ కార్యక్రమాలలో భక్తులందరూ భాగస్వాములై తను మన ధన పూర్వకంగా సమర్పించి ఆ పరమశివుని అనుగ్రహానికి పాత్రులై తమ జన్మను చరితార్థం చేసుకోగలరని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కోకట్ మాధవరెడ్డి కుమార్ తాండూరి రాజు విజయకుమార్ సెట్ మ్యాడం వెంకట్   ఆకుల రమేష్ కొత్తూరు కృష్ణ రఘునందన్ హుండేకార్ సత్యనారాయణ కూర వాసు తదితర ఆధ్యాత్మిక సేవాసమితి మండలి సభ్యులు పాల్గొన్నారు.