టిఆర్ఎస్ లోనే ఉంటావచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

Published: Tuesday September 13, 2022
టిఆర్ఎస్ లోనే ఉంటావచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా
మధిర సెప్టెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో ముందుగా ఏ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తానని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మధిరలోని డాక్టర్ కోటా రాంబాబు నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా తాను పోటీలో ఉంటానని ఆయన అన్నారు. ప్రస్తుతం తాను టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నందున  ఆ పార్టీ నుండి రాబోయే ఎన్నికల్లో   పోటీలో ఉంటానని ఈ సందర్భంగా ఆయన నొక్కి వక్కాణించారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలుపొందటం జరిగిందని ఆయన గుర్తు చేశారు. తర్వాత రాష్ట్రం విడిపోవడం తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరి పని చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో పాదయాత్ర చేసే అవకాశం ఉందా అని విలేకరుల ప్రశ్నించగా,  నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నారని, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానని అదే సమయంలో అధికార పార్టీలో ఉండి పాదయాత్ర చేయటం సమంజసం కాదన్నారు. ఈ సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ ఐలూరి వెంకటేశ్వర రెడ్డి డాక్టర్ కోటా రాంబాబు పెడమర్తి రవి బొమ్మెర రామ్మూర్తి యన్నం కోటేశ్వరరావు వేమిరెడ్డి లక్ష్మారెడ్డి చావలి రామరాజు ఎర్రగుంట రమేష్ బొబ్బిళ్ళపాటి బాబురావు అక్కినపల్లి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు